AWC: అఫ్గాన్ మహిళా క్రికెటర్ ల కోసం టాస్క్ ఫోర్స్ 7 d ago

తాలిబన్ల పాలనతో అఫ్గానిస్థాన్‌లో మహిళల క్రికెట్ చెదిరిపోగా, అఫ్గాన్ మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఐసీసీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మహిళలు ఆటలలో పాల్గొనడాన్ని తాలిబన్లు నిషేధించిన నేపథ్యంలో, కొంతమంది మహిళా క్రికెటర్ లు శరణార్థులుగా విదేశాలకు వెళ్లి క్రికెట్ ఆడుతున్నారు. వీరితో పాటు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులు దీనికి సహకరిస్తున్నాయి.